బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ..సైఫ్ అలీఖాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మొదటి బిడ్డ తైమూర్‌కి దేశ వ్యాప్తంగా ఆదరణ ఉంది. రెండోసారి కూడా అబ్బాయి జన్మించగా, ఇంక అతడిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. అయితే కరీనా తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి నుండి మానసిక, శారీరక అనుభవాలు, కష్ట నష్టాలను, పలువురి నిపుణులు సలహాలు, సూచనలను ప్రెగ్నెన్సీ బైబిల్లో పొందరుపరచింది.
తాజాగా ప్రెగ్నెన్సీ బైబిల్ని కరీనా లాంచ్ చేయగా, ఇది తనకు మూడో బిడ్డ లాంటిదని కరీనా పేర్కొంది. ఈ పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా పేర్కొన్నారు. 2020లో తైమూర్ బర్త్ డే సందర్భంగా ప్రెగ్నెన్సీ బైబిల్ తీసుకొస్తున్నట్టు ప్రకటించిన ఈ అమ్మడు తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.కాబోయే తల్లులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది.