శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 16:31:39

మ‌రో మైల్ స్టోన్ సాధించిన సాయి ధ‌ర‌మ్ తేజ్

మ‌రో మైల్ స్టోన్ సాధించిన సాయి ధ‌ర‌మ్ తేజ్

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ప్ర‌తి రోజూ పండగే చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. రిలీజ్ అయిన తొలి రోజు నుండి ఈ చిత్రం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. తేజూ కెరీర్‌లోనే బెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ చిత్రం తాజాగా బుల్లితెర‌పై కూడా స‌త్తా చాటింది. 

భారీ మొత్తంతో ప్ర‌తి రోజు పండ‌గే శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఛానెల్ ఇటీవ‌ల ఈ చిత్రాన్ని ప్ర‌సారం చేసింది. ఈ చిత్రానికి ఏకంగా 15.3 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ధరమ్ గత చిత్రాలలో బెస్ట్ రేటింగ్ కావడంతో పాటు, ఈ మధ్య కాలంలో మంచి టీఆర్పి సాధించిన చిత్రంగా ప్రతిరోజూ పండగే నిలిచింది. మారుతీ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌గా, జి ఏ 2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. థ‌మ‌న్ సంగీతం అందించారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo