ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా విధించిన లాక్డౌన్లాంటి పరిస్థితులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సెటైర్లు వేసింది. శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా ఆమె అక్కడి పరిస్థితిని చెప్పకనే చెప్పింది. ఓ గోడలు లేని రేకుల షెడ్డుకు ఉన్న డోర్‌కు లాక్ వేసిన ఫొటోను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ ఇలాగే ఉందంటూ ఆమె కామెంట్ చేసింది.
గత వారం కూడా కంగనా మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై స్పందించింది. అసలు మహారాష్ట్రలో లాక్డౌన్ ఉందా? సెమీ లాక్డౌన్ ఉందా? ఫ్లుయిడ్ లేదా ఫేక్ లాక్డౌన్ ఉందా? ఎవరైనా చెబుతారా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? పరిస్థితులు మెడపైన కత్తి పెట్టినట్లు ఉంటే వీళ్లు నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ ఆమె విమర్శించింది.