మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 14:47:07

ఆటో డ్రైవర్ల‌కి శానిటైజర్లు పంపిణీ చేసిన ప్ర‌ణీత‌

ఆటో డ్రైవర్ల‌కి శానిటైజర్లు  పంపిణీ చేసిన ప్ర‌ణీత‌

బెంగ‌ళూరు బ్యూటీ ప్ర‌ణీత క‌రోనా సంక్షోభంలో త‌న వంతు సాయాన్ని అందిస్తూ శ‌భాష్ అనిపించుకుంటుంది. స్టార్ హీరోలు కూడా చేయ‌ని ప‌నుల‌ని తాను చేస్తూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంది. ఆ మ‌ధ్య   త‌న‌ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 2000 చొప్పున 50 కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా అందిస్తున్నాను అని ప్ర‌ణీత తొలిసారి క‌రోనా విరాళం అందించింది.అంతేకాదు  ఎవరైతే పనుల్లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సహాయం అందిస్తానని ప్రణీత తెలిపారు.  అన్న‌ట్టుగానే స్వ‌యంగా వంట చేస్తూ పేద‌ల‌కి పంచుతుంది. కూడా

తాజాగా ఆటో డ్రైవ‌ర్స్‌కి  శానిటైజ‌ర్స్ పంపిణీ చేసింది ప్ర‌ణీత‌.  బెంగ‌ళూరులో ఆటోలు తిర‌గ‌డం మొద‌ల‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో అప్ర‌మ‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆటోడ్రైవ‌ర్స్‌, క‌స్ట‌మ‌ర్స్‌ను వేరు చేసేలా షీట్స్ ఉండ‌టం ఎంతో ముఖ్యం. కాబ‌ట్టి 100కి పైగా ఆటోడ్రైవ‌ర్స్‌కు ఇలాంటి షీట్స్‌తో పాటు శానిటైజ‌ర్స్‌ను కూడా పంపిణీ చేశాం  అని ప్ర‌ణీత త‌న ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ప్రణీత చేస్తున్న ఈ సామాజిక కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.


logo