కన్నడ నటి ప్రణీత ఎప్పుడు చాలా కూల్‌గా కనిపిస్తుంది. కరోనా సమయంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఆహార పంపిణి చేస్తూ పేదలు, ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలబడింది. పలు కారణాల వలన గత ఆదివారం రోజున అభిమానులకు చెప్పకుండానే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు ప్రణీత సుభాష్.
కొత్త పెళ్లి కూతురు తాజాగా గూగుల్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్‌లో ఇండియాలో చెత్త భాష ఏదని టైప్ చేయగా కన్నడ భాష అని కనిపించింది. దీంతో తన మాతృ భాషను గూగుల్ కించపరిచినట్టు భావించిన ప్రణీత ఫైర్ అయ్యారు. దేశభాషల్లోకెల్లా కన్నడ అత్యంత ప్రాచీనమైంది.. ఎంతో చరిత్ర ఉందని.. క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు ప్రణీత. కన్నడీగులు కూడా ఈ విషయంపై మండిపడడంతో గూగుల్ తన తప్పుని సరి చేసుకుంది. కాస్త దిగి వచ్చి కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ప్రణీత నటించిన బాలీవుడ్ సినిమా హంగామా 2 ఒటీటీ ద్వారా విడుదల కానుంది.