శనివారం 11 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 20:46:34

ఒంటరితనాన్ని ఇలా అధిగమించాను: ప్రణతిరాయ్

ఒంటరితనాన్ని ఇలా అధిగమించాను: ప్రణతిరాయ్

ముంబై: లవ్ ఆజ్ కల్ సినిమాలో తన అందచందాలతో అలరించింది ప్రణతిరాయ్ ప్రకాశ్. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా ఉంటోందట ప్రణతిరాయ్. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలోమాట్లాడుతూ...నేను షూటింగ్ లో ఉన్నపుడు లాక్ డౌన్ విధించారు. దీంతో షూటింగ్ రద్దయింది. హోంక్వారంటైన్ లో ఉన్నపుడు వివిధ రకాల పనులు చేస్తున్నా.

వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడంతోపాటు సంగీతం నేర్చుకోవడం, పాటలు రాయడం వంటి సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాను. ఈ పనులు తనను ఒంటరితనం నుంచి దూరం చేశాయని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ తో ఆగిపోయిన సినిమా షూటింగ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నానంది. logo