శనివారం 29 ఫిబ్రవరి 2020
గోవాలో షూటింగ్‌ చేయాలంటే ముందుగా స్క్రిప్ట్‌ అందజేయాలి: సీఎం

గోవాలో షూటింగ్‌ చేయాలంటే ముందుగా స్క్రిప్ట్‌ అందజేయాలి: సీఎం

Feb 15, 2020 , 12:01:53
PRINT
గోవాలో షూటింగ్‌ చేయాలంటే ముందుగా స్క్రిప్ట్‌ అందజేయాలి: సీఎం

టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలకి సంబంధించిన చాలా సినిమాలు గోవాలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రదేశాలలో రొమాంటిక్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తూ ప్రేక్షకులని థ్రిల్‌ చేస్తుంటారు దర్శకులు. అయితే రానున్న రోజులలో గోవాలో షూటింగ్‌ జరపాలంటే కొన్ని కండీషన్స్ తప్పక పాటించాలట. 

చాలా చిత్రాలలో గోవాను మాదక ద్రవ్యాల గమ్యస్థానంగా చూపిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అభిప్రాయపడ్డారు. ఇక మీదట గోవాలో షూటింగ్‌ చేయాలంటే ముందుగా స్క్రిప్ట్‌ని అధికారులకి అందజేయాలి. వారు స్క్రిప్ట్‌ పరిశీలించి అంతా ఓకే అంటేనే షూటింగ్‌ మొదలు పెట్టాలని సీఎం అన్నారు. ఇటీవల విడుదలైన మలంగ్‌ చిత్రంలో గోవాని మాదక ద్రవ్యాల అడ్డాగా చూపించారు. ఇలా చూపించడం వలన గోవా రాష్ట్ర గౌరవం దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్‌ సొసైట్‌ ఆఫ్‌ గోవా ప్రతి సినిమా స్క్రిప్ట్‌ని పరిశీలించి గోవాలో షూటింగ్‌ జరపాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది అని ప్రమోద్‌ స్పష్టం చేశారు. logo