మంగళవారం 26 మే 2020
Cinema - May 19, 2020 , 20:10:28

లాక్ డౌన్ లో ఫ్యామిలితో సరదాగా ప్రకాశ్‌ రాజ్‌..ఫొటోలు

లాక్ డౌన్ లో ఫ్యామిలితో సరదాగా ప్రకాశ్‌ రాజ్‌..ఫొటోలు

తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రకాశ్‌ రాజ్‌. ఈ విలక్షణ నటుడు ఓ వైపు నటిస్తూనే మరో సామాజిక సేవలో పాలుపంచుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇటీవలే లాక్‌ డౌన్‌ తో దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయిమిచ్చి అండగా ఉన్నారు. వారికి ఆహారం నిత్యవసరాలు అందజేశారు.

ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సతీమణి పోనీవర్మ, కుమారుడితో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. కుమారుడిని ఆడిస్తూ..అతనితో యోగాసనాలు వేశారు. మరోవైపు ఫాంహౌజ్‌ లో ప్రకాశ్‌ రాజ్‌ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.