విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పలు భాషలలో తన నటనతో ఎంతగా అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ప్రకాశ్ రాజ్‌కి ఉంది. ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప , రజినీకాంత్ అన్నాత్తే చిత్రాలతో పాటు పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రకాశ్ రాజ్.
ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు మరోసారి పెళ్లి చేసుకున్నారు ప్రకాశ్ రాజ్. చేసుకుంది ఎవరినో కాదు ఆయన భార్య పోనీ వర్మని. ఆగస్టు 24 తన పెళ్లి రోజు సందర్భంగా కొడుకు వేదాంత్ కోసం మరోసారి పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్.
ఈ పెళ్లి సంబరానికి మొదటి భార్య పిల్లలు సైతం హాజరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్ రాజ్ తన ట్విట్లో తెలియజేశారు.
ప్రకాష్ రాజ్ 2009లో డిస్కోశాంతి సోదరి లలితకుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉండగా, అబ్బాయి అనారోగ్యంతో చనిపోయాడు. కొన్నాళ్లకు హిందీ సినిమా కొరియో గ్రాఫర్ పోనీవర్మను ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు వేదాంత్ జన్మించాడు. 2010లో ప్రకాశ్ పోనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.