ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 12:46:34

కంగనా రనౌత్‌పై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు

 కంగనా రనౌత్‌పై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు

బెంగళూరు : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు సాధించారు. సోషల్ మీడియాలో #justasking పేరుతో వర్తమాన అంశాలపై తనదైన శైలి లో స్పందించే ప్రకాశ్‌రాజ్... తాజాగా  కంగనాపై  సెటైర్లు వేశారు. "ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలానే ఆలోచించాలా అనుకునే లా"  సంబంధిత ఫొటోలను ప్రకాశ్‌రాజ్ ట్వీట్టర్ లో ట్యాగ్ చేశారు. 


 


logo