e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News అందాల కంచె తెంచిన ప్ర‌గ్యా జైస్వాల్‌.. సోష‌ల్ మీడియా షేక్

అందాల కంచె తెంచిన ప్ర‌గ్యా జైస్వాల్‌.. సోష‌ల్ మీడియా షేక్

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. తొలి చిత్రం ప్ర‌గ్యాకి పెద్దగా పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చి పెట్ట‌లేదు. వ‌రుణ్ తేజ్ కంచె సినిమాతో అంద‌రి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌గ్యాకి ఆఫ‌ర్స్ వెల్లువ‌లా వ‌చ్చాయి. కాని ఏ సినిమా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో సైలైంట్ అయింది.

బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్ర‌గ్యా, ఆ తర్వాత మళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ నెటిజ‌న్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ విష‌యంలో ఈ అమ్మ‌డు హ‌ద్దులు దాటిపోతుంది.

- Advertisement -

తాజాగా ప్ర‌గ్యా జైస్వాల్ పొట్టి నెక్క‌రులో అందాలు ఆర‌బోస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మ‌డి ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా, నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ పై ప్రగ్యా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana