సంపత్‌కుమార్ (Sampathkumar) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సురాపానం’ (Suraapaanam). కిక్ అండ్ ఫన్ అనేది ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యానయన్ (Pragya Nayan) ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. మూవీ నుంచి ప్రగ్యా నయన్ ఫస్ట్‌లుక్‌ను ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని కూడా అందించబోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ మూవీలో అజయ్ ఘోష్, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రప్రసాద్, కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్