ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 10:55:16

కంచె బ్యూటీ సాహ‌సాలు చూశారా..!

కంచె బ్యూటీ సాహ‌సాలు చూశారా..!

'కంచె' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకున్న‌ ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాలోనే త‌న అందంతో, నటనతో మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో పాగా వేయ‌డం ప‌క్కా అని అంద‌రు భావించారు. కాని ప్ర‌గ్యాకు ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ కంటిన్యూ చేస్తుంది. 

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్  పోస్ట్ చేస్తండ‌డంతో పాటు ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా  రిహార్స‌ల్‌లో భాగంగా చేసిన వీడియోను షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ అమ్మ‌డు సినిమా ఆఫ‌ర్స్ కోసం ఎంత‌గానో ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రి రానున్న రోజుల‌లో నైన ప్ర‌గ్యాకు అదృష్టం క‌లిసొస్తుందా అనేది చూడాలి. 


 


logo