మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 12:02:50

అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి ఇన్‌డైరెక్ట్ పంచ్ ఇచ్చిన ప్రాచీ

అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి ఇన్‌డైరెక్ట్ పంచ్ ఇచ్చిన ప్రాచీ

సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా కొంద‌రు బ‌డా హీరోలు, నిర్మాత‌ల వైఖ‌రిని ఎండక‌డుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ అజ్ఞానాన్ని ప్ర‌శ్నిస్తూ ప్రాచీ దేశాయ్ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు ఫ్యాన్స్‌.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన  క్లాసిక్ హిట్ చిత్రం `బోల్ బచ్చన్`. ఈ చిత్రం రిలీజై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భం గా దేవగన్ స్వయంగా సినిమా సంగ‌తులు షేర్ చేసుకున్నాడు. అమితాబ్, అభిషేక్, రోహిత్ శెట్టిలతో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేయ‌డంతో పాటు వారి పేర్లే ప్ర‌స్తావించాడు. అసిన్‌, కృష్ణ అభిషేక్, అర్చ‌న పుర‌న్ సింగ్‌, అస్రానీ, నీర్జా వోహ్రా, జీతూ వ‌ర్మ‌, ప్రాచీ దేశాయ్ ఇలా ఎవరి పేర్లు ప్ర‌స్తావించ‌లేదు.  

ఈ విష‌యంపై కాస్త అసంతృప్తికి గురైన ప్రాచీ దేశాయ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిషేక్ - అమితాబ్ బచ్చన్ మినహా మిగతా వారందరినీ అజయ్ తన ట్వీట్ లో విస్మరించారని ఆరోపించింది. ఈ విష‌యంపై అజ‌య్ దేవ‌గ‌ణ్‌ని సూటిగా ప్ర‌శ్నించింది ప్రాచీ. ఆమె ధైర్యంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. 


logo