ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 11:19:36

మ‌రి కొద్దిసేప‌ట్లో త‌న భార్య‌ని ప్రపంచానికి ప‌రిచ‌యం చేయ‌నున్న ప్ర‌భుదేవా

మ‌రి కొద్దిసేప‌ట్లో త‌న భార్య‌ని ప్రపంచానికి ప‌రిచ‌యం చేయ‌నున్న ప్ర‌భుదేవా

న‌టుడు, కొరియోగ్రాఫర్, ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భుదేవా ఇటీవ‌ల సీక్రెట్ మ్యారేజ్ చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చాడు. మొద‌టి భార్య రామ‌లత‌కు విడాకులు ఇచ్చాక కొన్నాళ్లు న‌య‌న‌తార‌తో చెట్టాప‌ట్టాలు వేసిన ప్ర‌భుదేవా ఆమె నుండి విడిపోయాడు. ఇక త‌న మేన‌కోడ‌లిని చేసుకుంటాడని అంతా భావిస్తున్న స‌మ‌యంలో  త‌న‌కు ఫిజియోథెర‌పిస్ట్ గా ప‌నిచేసిన డాక్ట‌ర్ హిమానిని పెండ్లి చేసుకున్నాడు. ప్ర‌భుదేవా పెండ్లి చేసుకోవ‌డం మాకు సంతోషంగా ఉందని రాజు సుంద‌రం పేర్కొన్నాడు.

ప్ర‌భుదేవా, హిమానిల పెళ్లి జ‌రిగి చాలా రోజులే అవుతున్న రీసెంట్‌గా ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో త‌న భార్య‌ని ప్రపంచానికి ప‌రిచ‌యం చేయాల‌ని ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఇందుకోసం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. కాగా, వెన్నెముక గాయానికి చికిత్స తీసుకునే సమయంలో ఆయనకు, ఫిజియోథెరపిస్ట్‌ మధ్య పరిచయం ఏర్పడిందని..అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. దాదాపు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ఇద్దరు సెప్టెంబర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారని ప్రభుదేవా సన్నిహితులు అంటున్నారు.