మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 12:25:54

కోవిడ్ బారిన ప‌డ‌లేదు: సీనియర్ న‌టుడు

కోవిడ్ బారిన ప‌డ‌లేదు: సీనియర్ న‌టుడు

తెలుగు, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో న‌టించిన సినీయర్ స్టార్ ప్ర‌భుకు క‌రోనా సోకింద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అందుకు కార‌ణం అక్టోబ‌ర్ 1న ప్ర‌భు తండ్రి శివాజీ గ‌ణేష‌న్ జ‌యంతిని పురస్క‌రించుకొని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స్మార‌క కార్య‌క్ర‌మానికి ఆయ‌న రాక‌పోవ‌డ‌మే. ప్ర‌భుకు క‌రోనా సోకింద‌ని , అందుకే తండ్రి స్మార‌క కార్య‌క్ర‌మానికి రాలేదని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా స్పందించారు ప్ర‌భు.

నాకు క‌రోనా సోకింద‌ని, అందుకే క్వారంటైన్‌లో ఉన్నాన‌ని  వ‌చ్చిన వార్త‌ల‌లో నిజం లేదు. ఇటీవ‌ల నా కాలు బెణికింది. అందుక‌నే స్మార‌క కార్య‌క్ర‌మానికి హాజరు కాలేక‌పోయాను. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. త‌ప్పుడు వార్త‌లు న‌మ్మోద్దు అంటూ ప్ర‌భు పేర్కొన్నారు. ప్ర‌భు తెలుగులో చంద్ర‌ముఖి, డార్లింగ్ , బెజ‌వాడ త‌దిత‌ర చిత్రాల‌లో నటించారు. తాజాగా పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. 


logo