గురువారం 28 మే 2020
Cinema - May 08, 2020 , 14:49:30

ప్ర‌భాస్ 20వ మూవీ లాంచింగ్ ఫోటోలు వైరల్

ప్ర‌భాస్ 20వ మూవీ లాంచింగ్ ఫోటోలు వైరల్

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20వ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ జార్జియాలో జ‌రుపుకుంది. ఆ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు పూజాహెగ్డే, ప్రియదర్శిలపై  కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.  పదిడిగ్రీల చలి, వర్షం, కరోనా భయం..ఈ  ప్రతి కూల పరిస్థితులేవి చిత్రబృందంలోని స్ఫూర్తిని అడ్డుకోలేక‌పోయాయ‌ని  దర్శకుడు రాధాకృష్ణకుమార్ లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అంతేకాదు ‌ ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తాజాగా చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షూటింగ్ లాంచింగ్‌కి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేశారు. ఈ లాంచింగ్ కార్య‌క్రమానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, వివి వినాయ‌క్ , రెబల్ స్టార్ కృష్ణం రాజు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం లాంచింగ్ ఫోటోస్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌భాస్ 20వ చిత్రానికి బ్రేక్ ప‌డ‌గా, ఈ మూవీ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే దానిపై క్లారిటీ లేదు. ఓ డియ‌ర్ అనే టైటిల్‌ని చిత్రాన్ని ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌ట్లో విదేశాల‌కి వెళ్లే ఛాన్స్ లేక‌పోవ‌డంతో లాక్‌డౌన్ త‌ర్వాత  ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లోనే ఫారెన్ మాదిరి సెట్స్ వేసి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్. కాగా, ప్ర‌భాస్ త‌న 21వ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. logo