శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 13:33:08

మ‌రో బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!

మ‌రో బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే వ‌రుస‌గా నాలుగు పాన్ ఇండియా చిత్రాల‌ను అనౌన్స్ చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సిద్ధార్ద్ ఆనంద్‌తో క‌లిసి మ‌రో పాన్ ఇండియా చిత్రం చేసేందుకు స‌న్న‌ద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్‌, వార్ వంటి హై బ‌డ్జెట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఈ ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్ర‌భాస్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే  డిసెంబ‌ర్ 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. 2023 మూవీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌స్తుతం సిద్ధార్ద్ .. షారూఖ్ ఖాన్, దీపిక ప‌దుకొణే, జాన్ అబ్ర‌హం కాంబినేష‌న్‌లో ప‌ఠాన్ అనే సినిమా రూపొందిస్తున్నాడు. దీని త‌ర్వాత హృతిక్, దీపికా కాంబినేష‌న్‌లో ఫైట‌ర్ అనే వార్ డ్రామా చేయ‌నున్నాడు. ఇవి పూర్త‌య్యాక ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, ప్రభాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌శాంత్ నీల్ స‌లార్, ఓం రౌత్ ఆదిపురుష్ మొదలు పెట్ట‌నున్నాడు. ఇక నాగ్ అశ్విన్ పీరియాడిక‌ల్ చిత్రం కూడా  వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ పైకి వెళుతున్న‌ట్టు అర్ద‌మ‌వుతుంది. 

VIDEOS

logo