సోమవారం 25 మే 2020
Cinema - Apr 08, 2020 , 17:35:07

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఏం చేస్తున్నాడంటే..!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఏం చేస్తున్నాడంటే..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల ముందే జార్జియాలో షూటింగ్ ముగించుకొని ఇండియా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్స్ అన్నీ బంద్ కావ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ స‌మ‌యాన్ని ప్ర‌భాస్ అద్భుతంగా వినియోగించుకుంటున్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి., 

ఎక్కువ సమ‌యాన్ని నిద్ర‌కే కేటాయిస్తున్న ప్ర‌భాస్‌, ఖాళీగా ఉన్న‌ప్పుడు ఇండ‌స్ట్రీకి సంబంధించిన త‌న స్నేహితులు రాజ‌మౌళి, రానా, అనుష్క వంటి వారితో వీడియో కాన్ఫ‌రెన్స్ చేస్తున్నార‌ట‌.  తన చిత్రం ఆలస్యం అవుతోందని ప్రభాస్ అస్సలు బాధపడటం లేదని,   ఇతర విషయాలకన్నా మానవ మనుగడ ముఖ్యమని ప్ర‌భాస్ అంటున్నార‌ని టాక్. బాహుబ‌లి, సాహో సినిమా రిలీజ్‌ల‌కి చాలా స‌మ‌యం తీసుకున్న ప్ర‌భాస్ ఓ డియ‌ర్‌( వ‌ర్కింగ్ టైటిల్‌) విష‌యంలో త‌న ప్ర‌మేయం లేకుండానే లేట్ అవుతుంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo