శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 14:05:17

సినిమాల్లోకి రానున్న ప్రభాస్‌ సోదరి ప్రసీద

సినిమాల్లోకి రానున్న ప్రభాస్‌ సోదరి ప్రసీద

హైదరాబాద్‌ : చాలా మంది నటవారసులు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. వారు ఎవరో కాదు కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌ చిత్ర నిర్మాణంలో కూడా  ఆమె పాలుపంచుకుంటుంది. రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమో‌ద్‌తో పాటు ప్రసీద కూడా ఉన్నాది. సినిమాలతో పాటుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నాదట.

ఇప్పటికే కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేం కె.రాథాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన  ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo