శుక్రవారం 15 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 00:09:01

ప్రభాస్‌ ‘సలార్‌'

ప్రభాస్‌ ‘సలార్‌'

వరుసగా సినిమాల్ని అంగీకరిస్తూ జోరుమీదున్నారు ప్రభాస్‌. తాజాగా మరో పాన్‌ ఇండియన్‌ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారాయన. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘సలార్‌' అనే పేరును ఖరారు చేశారు.  హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్‌ లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో గన్‌పై చేతిని ఉంచి ైస్టెలిష్‌గా ప్రభాస్‌ కనిపిస్తున్నారు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మెన్‌. కాల్‌డ్‌ వన్‌ మెన్‌. ది మోస్ట్‌ వయోలెంట్‌' అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్‌ ఆసక్తిని పంచుతోంది.  ‘సినిమాల పట్ల ఉన్న అమితమైన ప్రేమతో భాష పరమైన హద్దులను చేరిపివేస్తూ రూపొందిస్తున్న భారతీయ చిత్రమిది. అత్యంత క్రూరుడిగా పిలవబడే ఓ వ్యక్తి కథతో ‘సలార్‌'ను రూపొందిస్తున్నాం’ అని ట్విట్టర్‌ ద్వారా ప్రశాంత్‌నీల్‌ తెలిపారు. ‘సలార్‌' ప్రపంచంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. 2021 జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆరంభించబోతున్నాం’ అని ప్రభాస్‌ తెలిపారు.  నిర్మాత మాట్లాడుతూ “కేజీఎఫ్‌-1’, ‘కేజీఎఫ్‌-2’ తర్వాత తమ సంస్థ నుండి రానున్న మూడో పాన్‌ ఇండియన్‌ చిత్రమిది. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కలయికలో  భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారతీయ భాషలన్నింటిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. ‘రాధేశ్యామ్‌' విడుదల తర్వాత ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.