శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 15, 2021 , 13:08:55

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

స్టార్ హీరో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం స‌లార్‌. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్ర‌భాస్ తోపాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలిమ్స్  విజ‌య్‌ కిర‌గండూర్, ప్ర‌భాస్ సార్ కు ధ‌న్య‌వాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (య‌శ్‌)కు ధ‌న్య‌వాదాలు. స‌లార్ మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర్చ‌దు. మాకు మీ ప్రేమ, మ‌ద్ద‌తు అందిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేశాడు.

ప్ర‌స్తుతం రాధేశ్యామ్ తోపాటు స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో ‌న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చిత్రం స‌లార్. స‌‌లార్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాప‌టానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశ‌మున్న‌ట్టు తెలుస్తున్నా..అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. 

ఇవి కూడా చ‌ద‌వండి

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!
మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌
మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo