బుధవారం 03 జూన్ 2020
Cinema - Jan 18, 2020 , 01:33:18

భాగ్యనగరిలో సందడి

 భాగ్యనగరిలో సందడి

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో గోపికృష్ణ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ప్రధాన తారాగణంపై ముఖ్యఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘ైస్టెలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రభాస్‌ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. హస్తసాముద్రికం నేపథ్యంలో సాగే కథ ఇదని, ఈ సినిమాకు ‘జాన్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో స్పందించారు. ‘తిరిగి షూటింగ్‌లో జాయిన్‌ కావడం ఆనందంగా ఉంది. వినోదప్రధానంగా సాగే ఓ షెడ్యూల్‌ ఇది’ అంటూ సెట్‌ తాలూకు ఫొటోను పంచుకున్నారు ప్రభాస్‌. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, ఎడిటర్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, సమర్పణ: గోపికృష్ణ మూవీస్‌, నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌, నిర్మాతలు: ప్రమోద్‌, వంశీ, దర్శకత్వం: కేకే రాధాకృష్ణ కుమార్‌.


logo