బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 09:55:53

ఈ సారి బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్న ప్ర‌భాస్..!

ఈ సారి బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్న ప్ర‌భాస్..!

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచాడు. ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్వ‌క‌త్వంలో త‌న 20వ చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమాకి క‌రోనా వ‌ల‌న బ్రేక్ ప‌డింది. మ‌రికొద్ది రోజుల‌లో చిత్ర షూటింగ్ ప్రారంభించి వీలైనంత ్‌త్వ‌ర‌గా సినిమాని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇక ప్ర‌భాస్ 21వ సినిమాకి సంబంధించి కూడా గ‌త కొద్ది రోజుల క్రితం అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం పీరియాడిక‌ల్ మూవీగా రూపొందుతుంద‌ని, భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. క‌ట్ చేస్తే ప్ర‌భాస్ .. టి సిరీస్ సంస్థ‌తో ఓ సినిమాను చేయాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. త‌న 22వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమాని  ‘తానాజీ’ ద‌ర్శ‌కుడు ఓం రావుత్   తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తు‌న్నాయి. ప్ర‌స్తుతం సౌత్‌లో క‌న్నా నార్త్‌లోనే ప్ర‌భాస్ సినిమాల‌కి ఎక్కువ‌గా ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో రాబోవు రోజుల‌లో ప్ర‌భాస్ బాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌తో సినిమాలు చేయ‌నున్నాడ‌ని అంటున్నారు

 


logo