బుధవారం 03 జూన్ 2020
Cinema - May 07, 2020 , 10:01:46

ఫ్యాన్స్‌కి షాక్..2022లో ప్ర‌భాస్ చిత్రం

ఫ్యాన్స్‌కి షాక్..2022లో ప్ర‌భాస్ చిత్రం

బాహుబ‌లి త‌ర్వాత నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌తి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. బాహుబ‌లి చిత్రం కోసం దాదాపు ఐదేళ్ళ స‌మ‌యం తీసుకున్న ప్ర‌భాస్ సాహోకి రెండేళ్లు కాల్షీట్స్ కేటాయించాడు. ఇక ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా మొద‌లై చాలా రోజులే అవుతున్నా, రిలీజ్ ఎప్పుడ‌నే దానిపై క్లారిటీ లేదు. 

ఇటీవ‌ల ప్ర‌భాస్‌- నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పీరియాడిక‌ల్ డ్రామా తెర‌కెక్క‌నుంద‌ని, ఈ చిత్రాన్ని అశ్వినీద‌త్ నిర్మించ‌నున్నాడ‌ని అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ నుండి ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లి వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని తాజా స‌మాచారం ఈ చిత్రం ఏప్రిల్ 2022లో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు.


logo