శుక్రవారం 03 జూలై 2020
Cinema - May 09, 2020 , 10:48:26

బాలీవుడ్ హీరోల‌ని వెన‌క్కి నెట్టిన ప్ర‌భాస్

బాలీవుడ్ హీరోల‌ని వెన‌క్కి నెట్టిన ప్ర‌భాస్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ‌త ఏడాది సాహో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కింది. ఇందులో శ్ర‌ద్ధా క‌పూర్ కథానాయిక‌గా న‌టించింది. తెలుగులో పెద్ద‌గా అల‌రించక‌లేక పోయిన ఈ చిత్రం హిందీలో మాత్రం రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా సాహో హిందీ వ‌ర్షెన్ అక్ష‌య్ కుమార్ హౌజ్‌ఫుల్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ సూర్యవంశం చిత్రాల‌ని బీట్ చేసి టాప్‌లో నిలిచింది.

లాక్‌డౌన్ వ‌ల‌న సాహో హిందీ వ‌ర్షెన్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. బార్క్ రేటింగ్స్ ప్ర‌కారం ఏప్రిల్ 25 నుండి మే 1 వ‌ర‌కు సాహో చిత్రం అన్నింటిని మించి టాప్ లో నిలిచింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో 5,303,000 ఇంప్రెష‌న్స్, గ్రామాల‌లో 3,300,000 ల‌భించాయి. మొత్తంగా 8.33 మిలియ‌న్స్ ఇంప్రెష‌న్స్ ఈ చిత్రం సొంతం చేసుకుంది. సాహో చిత్రం త‌ర్వాత రెండో స్థానంలో బాహుబ‌లి ది బిగినింగ్ 7,389,000 ఇంప్రెష‌న్స్‌తో నిలిచింది. మూడో స్థానంలో ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్ హిందీ వ‌ర్షెన్ (7,190,000), నాలుగో స్థానంలో అక్ష‌య్ కుమార్ హౌజ్‌ఫుల్‌(6,018,000), ఐదో స్థానంలో అమితాబ్ బ‌చ్చ‌న్ సూర్య‌వంశం (4,773,000) ఉన్నాయి. గ‌త ఏడాది ఆగ‌స్ట్ 30న విడుద‌లైన సాహో చిత్రం రూ.433 కోట్లకి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టింది


logo