గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 15:31:06

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క‌ర్ణాట‌క ప్ర‌భాస్ ఫ్యాన్స్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క‌ర్ణాట‌క ప్ర‌భాస్ ఫ్యాన్స్

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతుంది. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు, రాష్ట్రాలు, దేశాల‌లో ప్ర‌తి ఒక్క‌రు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌భాస్ ఫ్యాన్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. బెంగ‌ళూరులోని కిద్వారి క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ప్రాంతంలో ఉన్న 1500 చ‌ద‌ర‌పు గ‌జాల ఖాళీ స్థ‌లంలో మొక్క‌లు నాటారు.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ నాటిన మొక్క‌ల‌లో  180 ఔష‌ద మొక్క‌లు ఉన్నాయి. రెబల్ స్టార్స్ కృష్ణంరాజు, ప్రభాస్ స్ఫూర్తితో ప్రతి సంవత్సరం సామాజిక కార్యకలాపాలను చేపడుతామని కర్ణాటకకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేర్కొంది. గ‌తంలో ప్ర‌భాస్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటారు. 1650 ఎకరాల అటవీ ప్రాం తాన్ని దత్తత తీసుకున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంట సంగారెడ్డి జిల్లా జిన్నారం-దుండిగల్‌ మధ్యలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును అభివృద్ధిచేసేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. ముందస్తుగా రూ.2 కోట్ల చెక్కును ప్రభుత్వానికి అందించారు. దత్తత తీసుకున్న అటవీ ప్రాంతంలో హీరో ప్రభాస్‌ తన తండ్రి యూవీఎస్‌ రాజు పేరిట అర్బన్‌ ఫారెస్టు పార్కును అభివృద్ధి చేయనున్నారు.