e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News బీఏ రాజు మృతిపై సంతాపం తెలియ‌జేసిన‌ ప్ర‌భాస్

బీఏ రాజు మృతిపై సంతాపం తెలియ‌జేసిన‌ ప్ర‌భాస్

బీఏ రాజు మృతిపై సంతాపం తెలియ‌జేసిన‌ ప్ర‌భాస్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు మ‌ర‌ణ వార్త‌తో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మంచిగా ఉన్న వ్య‌క్తి ఇలా స‌డెన్‌గా తుదిశ్వాస విడ‌వ‌డం బాధ‌కు గురి చేస్తుంది. మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, సాయి ధ‌ర‌మ్ తేజ్ వంటి హీరోలు బీఏ రాజు మృతిపై సంతాపం వ్య‌క్తం చేయ‌గా, తాజాగా ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్ ద్వారా బీఏ రాజు మృతిప‌ట్ల సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ , పీఆర్ఓ బీఏ రాజు గారు ఆకస్మిక మరణంతో షాక్ అయ్యాను. అతను నాకు ఫ్యామిలీ మెంబ‌ర్ లాంటి వారు. నా కెరీర్‌లో అత‌నితో క‌లిసి చాలా చిత్రాలు పని చేశాను. ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం గొప్ప అనుభూతి. సినీ ఇండ‌స్ట్రీకి ఆయ‌న మ‌ర‌ణం పెద్ద న‌ష్టం. బీఏ రాజు ఆత్మ‌కు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని ప్ర‌భాస్ అన్నారు.

ఇక ద‌ర్శ‌కేందుకు రాఘవేంద్ర‌రావు కూడా బీఏ రాజు మృతి ప‌ట్ల స్పందించారు. “బి ఏ రాజు… నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే… తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.” అని సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్త పరిచారు.

ఇవి కూడా చదవండి..

కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
నేపాల్‌ పార్లమెంట్‌ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
తెలంగాణకు వర్ష సూచన
విలక్షణ నటుడు చంద్రమోహన్‌ జన్మదినోత్సవాలు
Vaccination @ 126 Day’s.. 19.32 కోట్ల డోసుల పంపిణీ
ఆన్‌లైన్‌ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్‌ ఎటాక్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీఏ రాజు మృతిపై సంతాపం తెలియ‌జేసిన‌ ప్ర‌భాస్

ట్రెండింగ్‌

Advertisement