శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 10:57:42

ఇట‌లీలో ప్ర‌భాస్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్

ఇట‌లీలో ప్ర‌భాస్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్  శుక్ర‌వారం( అక్టోబ‌ర్ 23) 41వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక అభిమానులు ఆయ‌న బ‌ర్త్‌డేని పండుగ‌లా జ‌రుపుకున్నారు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు.

ఇక రాధే శ్యామ్ చిత్ర షూటింగ్‌లో భాగంగా ప్ర‌స్తుతం ఇటలీలో ఉన్న ప్ర‌భాస్ త‌న బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని యూనిట్ స‌భ్యుల మ‌ధ్య సంతోషంగా జ‌రుపుకున్నాడు. ప్ర‌భాస్ కేక్ క‌ట్ చేస్తున్న ఫోటో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న రాధే శ్యామ్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం,  ఆదిపురుష్ అనే చిత్రం చేయ‌నున్నాడు.