మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 14:54:33

ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో ప్రభాస్‌..ఫొటోలు వైరల్‌

ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో ప్రభాస్‌..ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌:   ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్    సందడి చేశారు. తన  కొత్త కారు  రిజిస్ట్రేషన్ కోసం   స్టార్ హీరో ప్రభాస్‌  ఆర్టీఏ ఆఫీసుకు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మాస్క్‌ ధరించిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫొటోలకు పోజిచ్చారు. 

ప్రతి ఒక్కరు  డార్లింగ్‌తో  ఫొటోలు దిగారు. యంగ్‌ హీరోతో దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో  వైరల్‌గా మారాయి.  గత మార్చిలో విదేశాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ప్రభాస్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లాడు.  చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ బహిరంగంగా కనిపించాడు.   ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రాధేశ్యామ్`లో నటిస్తున్నాడు.


తాజావార్తలు


logo