బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 00:24:03

ప్రేమకు ప్రతిరూపం రాధేశ్యామ్‌

ప్రేమకు ప్రతిరూపం  రాధేశ్యామ్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్‌' అనే పేరును ఖరారు చేశారు. కె.కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. శుక్రవారం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను చిత్రబృందం విడుదలచేసింది.  ఫస్ట్‌లుక్‌లో ఎరుపువర్ణంతో కూడిన నీటి అలల మధ్య ప్రభాస్‌, పూజాహెగ్డే రొమాంటిక్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. యూరప్‌తో పాటు వివిధ దేశాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టగానే  తిరిగి సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.  ‘పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమకు ప్రతిరూపమైన రాధేశ్యామ్‌ల కథేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. ప్రభాస్‌ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది.  పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొన్నది. సత్యరాజ్‌, భాగ్యశ్రీ, కునాల్‌రాయ్‌కపూర్‌, జగపతిబాబు, జయరాం, శాషాఛెత్రి, రిద్దికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, సౌండ్‌ డిజైన్‌: రసూల్‌ పూకుట్టి. 

తాజావార్తలు


logo