శుక్రవారం 03 జూలై 2020
Cinema - Mar 13, 2020 , 21:44:17

ప్రభాస్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌లో టైమ్‌మిషన్‌ కాన్సెప్ట్‌!

ప్రభాస్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌లో టైమ్‌మిషన్‌ కాన్సెప్ట్‌!

బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ చిత్రం  గుర్తుందా.. ఈ సినిమాలో టైమ్‌మిషన్‌ ద్వారా హీరో, హీరోయిన్‌లు గడిచిపోయిన కాలంతో పాటు భవిష్యత్‌ కాలానికి సైతం ప్రయాణించడం అందర్ని అలరించింది. సో..ఇప్పుడు అలాంటి టైమ్‌మిషన్‌ కాన్సెప్ట్‌తో ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తన తదుపరి చిత్రాన్ని రూపొందించబోతున్నాడని తెలిసింది. ‘ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌లో ఆడియన్స్‌కు ‘టైమ్‌ మిషన్‌' థ్రిల్ల్‌ను మరోసారి అందించనున్నారని సమాచారం. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్న ఈ చిత్రం కోసం ప్రభాస్‌ 70 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాట కూడా తీసుకుంటున్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. 
logo