e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News ఒకే చోట 90 శాతం షూటింగ్ చేసుకోనున్న‌ ప్ర‌భాస్ కొత్త సినిమా

ఒకే చోట 90 శాతం షూటింగ్ చేసుకోనున్న‌ ప్ర‌భాస్ కొత్త సినిమా

ఈ రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. అందులోనూ లొకేష‌న్ల విష‌యంలో ద‌ర్శ‌కులు చాలా ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉంటున్నారు. త‌మ ఊహాల‌కు త‌గ్గ‌ట్టుగా సీన్ రావ‌డానికి విదేశాల‌కు వెళ్లేందుకు కూడా వెనుకాడ‌టం లేదు. అలాంటి ప్ర‌భాస్ వంటి పాన్ ఇండియ‌న్ స్టార్ సినిమా అంటే లొకేష‌న్ల విష‌యంలో ఇంకెంత కేర్ ఉండాలి. అలాంటిది ప్ర‌భాస్ రాబోయే సినిమా షూటింగ్ దాదాపుగా ఒకే చోట జ‌ర‌గ‌బోతోంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రాధే శ్యామ్ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న స‌లార్ షూటింగ్ సగానికిపైగా పూర్త‌యింది. ఇక బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా ముంబైలో జ‌రుగుతుంది. ఇంత‌లోనే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా మొద‌లు పెట్టాడు ప్ర‌భాస్‌. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా మొదలైంది. ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. నిర్మాణ రంగంలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ దాదాపు 300 కోట్లతో ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాను నిర్మిస్తుంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కుర్ర దర్శకుడు చేస్తున్న సినిమా ఇది. టైం మిషన్ ఆధారంగా సాగే సైంటిఫిక్ డ్రామా ఇది అని ప్రచారం జరుగుతుంది. ఇందులో ప్రభాస్ అతీత శక్తులు ఉన్న సూపర్ హీరోగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ సినిమా ట్రయల్ షూట్ రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటికే మొదలు పెట్టారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దీపికా పదుకొనే కూడా జాయిన్ కానుంది. ఇదంతా ఇలా ఉంటే సినిమా షూటింగ్‌లో 90% రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తాను రాసుకున్న కథకు పూర్తిస్థాయి వసతులు కలిగిన ప్రదేశం కేవలం రామోజీ ఫిలిం సిటీ మాత్రమే అని ఆయన ఫిక్స్ అయ్యాడు. కేవలం 10 శాతం షూటింగ్ మాత్రమే బయట ప్రదేశాల్లో చేయబోతున్నారు. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

సిల్క్ స్మిత‌ను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌వ‌న్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో

RRR ప్ర‌మోష‌న్స్ | ఐదు భాష‌ల్లో దోస్తీ సాంగ్‌.. ఒక్కో భాష‌లో ఒక్కో సింగర్‌

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

బుచ్చిబాబు మ‌ళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana