గురువారం 28 మే 2020
Cinema - May 02, 2020 , 09:39:45

ప్ర‌భాస్- అమీర్ ఖాన్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం !

ప్ర‌భాస్- అమీర్ ఖాన్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం !

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ సినిమాల‌కి ప్రేక్ష‌కుల నుండి భారీ ఆద‌ర‌ణ వ‌స్తుండ‌డంతో వ‌రుస మ‌ల్టీస్టార‌ర్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌భాస్- అమీర్ ఖాన్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం రూపొంద‌నుంద‌నే వార్త సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ చిత్రాన్ని ఓ కుర్ర ద‌ర్శ‌కుడు పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తార‌ట‌.

వివ‌రాల‌లోకి వెళితే  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్జేఎస్. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న .. నాకు "మల్టీస్టారర్ చిత్రాలంటే  చాలా ఇష్టం. బన్నీ-ఎన్టీఆర్ లతో జాన్ విక్ స్టైల్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీయాలని ఉంది. అలాగే ఆమిర్ ఖాన్- ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ ను తెరకెక్కించాలని ఉంది అది నా డ్రీం ప్రాజెక్ట్. వీటితో పాటు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నా” అని తన కోరికలను బయట పెట్టారు. మ‌రి మనోడి కోరిక‌లు ఎప్ప‌టికీ తీర‌తాయో చూడాలి. ప్ర‌స్తుతం ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. 


logo