టాలీవుడ్ పవర్ స్టార్ ఓ సంచారి అంటున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఎందుకలా అంటే పవన్ కల్యాణ్ తో తీయబోయే సినిమా టైటిల్ అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పేరుని హీరోతో పాటు నిర్మాతలు కూడా ఓకే చేశారట. దీంతో సంచారి టైటిల్ ని రిజిస్టర్ చేయించబోతున్నారట. ఇంతకుముందు వీరి కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చింది. అది బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. ఇప్పుడు దాన్ని మించిన హిట్ ఇస్తాననంటున్నాడు హరీశ్ శంకర్. అందుకు తగ్గట్టు పక్కా మాస్ ఎలిమెంట్స్ తో కథని రెడీ చేశాడట. పవర్ స్టార్ ని ఇంతుకుముందు ఎప్పుడూ వెండితెరపై చూడని విధంగా సరికొత్తగా ఈ సంచారి సినిమాలో చూపిస్తాడట హరీశ్ శంకర్. ప్రస్తుతం పవర్ స్టార్ అటు క్రిష్ డైరక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇటు సాగర్ డైరక్షన్ లో అయ్యప్పన్ కోషియామ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. దీనికి త్రివిక్రమ్, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత హరీశ్ శంకర్ డైరక్షన్ లో సినిమాని ప్రారంభించనున్నాడు పవర్ స్టార్.