బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 17:40:03

‘‘పవర్‌స్టార్‌’ నుంచి పవర్‌ రొమాంటిక్‌ పోస్టర్‌’’

‘‘పవర్‌స్టార్‌’  నుంచి పవర్‌ రొమాంటిక్‌ పోస్టర్‌’’

వివాదాల దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘పవర్‌స్టార్‌’ పేరుతో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోని కొన్ని లుక్‌లను ఇటీవల విడుదల చేసిన ఆర్జీవీ పవన్‌ను పోలిన వ్యక్తిని ఇందులో ప్రధాన పాత్రధారుడిగా ఎంచుకున్నారు. ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తుండగా పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం రాంగోపాల్‌వర్మపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి శనివారం ఆర్జీవీ మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ‘‘పవర్‌స్టార్‌’ నుంచి పవర్‌ రొమాంటిక్‌ పోస్టర్‌’’ అనే ట్యాగ్‌ను జతచేశారు. 

‘పవర్‌స్టార్‌’సినిమా ప్రధాన పాత్రధారుడి పక్కన ఒక ఆంగ్ల యువతి కూర్చున్నట్లు ఉన్న ఈ పోస్టర్‌ను చూసిన పవన్‌ ఫ్యాన్స్‌ ఆర్జీవీపై మరింతగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo