విజయ్ధరన్, రాశీసింగ్, అక్షత, సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పోస్టర్’. టి.మహిపాల్ రెడ్డి దర్శకుడు. టి.శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ యూఎఫ్ఓ విడుదల చేస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ మన ఊరిలో, మన ఇంటి పక్కన, మన ఇంట్లో, మన స్నేహితులకు జరిగే కథలా వుంటుంది. యూఎఫ్ఓ లాంటి పెద్ద సంస్థ మా చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా వుంది’ అన్నారు. ఈ సినిమాకి మాటలు: నివాస్.