బుధవారం 08 జూలై 2020
Cinema - May 29, 2020 , 09:20:29

క‌రోనాపై 'అ' డైరెక్ట‌ర్ చిత్రం.. మోష‌న్ పోస్ట‌ర్

క‌రోనాపై 'అ' డైరెక్ట‌ర్ చిత్రం.. మోష‌న్ పోస్ట‌ర్

అ!, కల్కి’ చిత్రాలతో ఆక‌ట్టుకున్న‌ యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ప్ర‌శాంత్ తాజాగా కొత్త జాన‌ర్‌తో కొత్త చిత్రం చేస్తున్నారు. కరోనా వైరస్‌కి మందు క‌నిపెట్టే క‌థ‌తో చిత్రం రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి ‘కరోనా వ్యాక్సిన్‌’ అనే  టైటిల్ ఫిక్స్ చేశార‌ని అంటున్నారు.

ఈ రోజు ప్ర‌శాంత్ వ‌ర్మ బ‌ర్త్ డే సంద‌ర్బంగా మోషన్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. తెలుగు రాష్ట్రాల‌పై క‌రోనా ర‌క్క‌సి ఎలా ఉంటుంద‌నేది సింపుల్‌గా వీడియోలో చూపించారు. అతి త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.  అయితే ఈ చిత్రం అ మూవీకి సీక్వెల్ అని జోరుగా ప్ర‌చారం అవుతున్న క్ర‌మంలో ఆ వార్త‌ల‌ని ఖండించారు ద‌ర్శ‌కుడు. logo