బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Jun 25, 2020 , 15:29:12

దీపికాకి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన ఫోటోగ్రాఫ‌ర్

దీపికాకి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన ఫోటోగ్రాఫ‌ర్

ఇటీవ‌ల‌ ఓ ఫోటోగ్రాఫ‌ర్ సుశాంత్ మృత‌దేహాన్ని ఆస్ప‌త్రి నుంచి శ్మ‌శాన వాటిక వ‌ర‌కు తీసుకెళుతున్న స‌న్నివేశాల‌ని వీడియో ద్వారా బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి దయచేసి నా ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ పోస్ట్ చేయరాదు అని పేర్కొన్నారు . ఇది దీపికా దృష్టిన‌ ప‌డ‌డంతో వెంట‌నే త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. అస‌లు ఈ వీడియో తీయ‌డం స‌బ‌బేనా?  సుశాంత్ కుటుంబం అనుమ‌తి లేకుండా వీడియో తీసి దానిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి డ‌బ్బు సంపాదించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ మండిప‌డింది దీపికా.

దీపికా వ్యాఖ్య‌ల‌ని కొంద‌రు స‌పోర్ట్ చేయ‌గా మ‌రి కొంద‌రు విభేదించారు. తాజాగా  ఫోటోగ్రాఫ‌ర్ దీపికా ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇస్తూ.. పార్టీ కి పిలిస్తే అందరు వస్తారు తాగి వెళ‌తారు. కాని ఎవరైనా చనిపోతే మాత్రం ఎవరు రారు.. ఇదొక దిక్కుమాలిన ఇండస్ట్రీ .. ఎవరో రజా మురాద్, అశోక్ పండిట్ లాంటి వాళ్ళు మాత్రమే ఎప్పుడూ వస్తారు . ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డ‌బ్బు సంపాదిస్తే లేదు కాని, అంత్యక్రియ‌ల ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం అనేది చీప్‌గా ఉంది. బ‌సు చ‌ట‌ర్జీ అంత్య‌క్రియ‌లు కూడా డ‌బ్బుల కోస‌మే క‌వ‌ర్ చేశాన‌ని అనుకుంటారా అని ట్వీట్ చేశాడు స‌ద‌రు ఫోటోగ్రాఫ‌ర్.

"చాలా టీవీ చానెల్స్ మరియు మీడియా సంస్థలు అంత్యక్రియల గురించి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి .అవిఎటువంటి మార్గదర్శకాలను పాటించలేదు. అయిన‌ప్ప‌టికీ ఫోటోగ్రాఫ‌ర్స్‌ని తిడ‌తారు. నేను ఎప్పుడూ విమర్శలకు, ప్రతికూలతల‌ని స్వీక‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను. నేను సొంతంగా సోష‌ల్ మీడియాని హ్యాండిల్ చేస్తున్నాను. ఇందులో ఎన్నో త‌ప్పులు రావొచ్చు. వాటిని నా ఫాలోవ‌ర్స్ స‌రిచేస్తారు. నా పోస్ట్‌లు అంద‌రిని ఆక‌ర్షింప‌చేస్తాయి. కాని మ‌మ్మ‌ల్ని ఆక‌ర్షించ‌వు అని విర‌ల్ బయానీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు.


logo