మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 19:27:44

ప్రముఖ పాప్ సింగర్ కు కరోనా

  ప్రముఖ పాప్ సింగర్ కు కరోనా

హైదరాబాద్ : పాప్ సింగర్ స్మిత కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు." నిన్న వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల బాడీ పెయిన్స్ వచ్చాయనుకున్నా... కానీ ఎందుకైనా మంచిదని శశాంక్ ,నేను కోవిడ్ పరీక్ష లు చేయించుకున్నాం, పాజిటివ్ గా తేలింది. ప్లాస్మా దానం చేయండి. మేము ఇంట్లో జాగ్రత్తగా ఉన్నా... కరోనా మా ఇంటికి వచ్చింది." అని స్మిత ట్వీట్ చేశారు. మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి మాత్రం నెగిటివ్ గా తేలింది. "ఎటువంటి లక్షణాలు లేకుండానే  కరోనా గా తేలింది....త్వరలో నే  కోవిడ్ ను తరిమికొడ తాను.. ప్లాస్మా దానం చేయండి" అని పాప్ సింగర్ స్మితా కోరారు. 



logo