మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 01:54:34

పూర్ణ బ్యాక్‌డోర్‌ ఎంట్రీ

 పూర్ణ బ్యాక్‌డోర్‌ ఎంట్రీ

కథానాయిక పూర్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాక్‌డోర్‌'. కర్రి బాలాజీ దర్శకుడు. బి.శ్రీనివాస రెడ్డి నిర్మాత. యువ కథానాయకుడు తేజ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పూర్ణ, తేజలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘పూర్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రమిది. ప్రేక్షకులు థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే అంశాలతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే తెరకెక్కుతున్న చిత్రమిది’అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్‌ నారోజ్‌, రచనా సహకారం: భూపతిరాజు, రామకృష్ణ.