మంగళవారం 19 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 00:05:42

పేదల పాలిట పెన్నిధి టీఆర్‌ఎస్‌

పేదల పాలిట పెన్నిధి టీఆర్‌ఎస్‌

కేసీఆర్‌గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ప్రకటనలో సినిమా ఇండస్ట్రీని కంటికిరెప్పలా కాపాడుకుంటామని మాటిచ్చారు.  ఆ మాటను నిజం చేస్తూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతూ  మంచి మనసున్న నేతగా కేసీఆర్‌ నిరూపించుకుంటున్నారు’ అని అన్నారు సినీ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కాదంబరి కిరణ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో కాదంబరి కిరణ్‌ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ పిల్లల ఆలనాపాలన చూసే తండ్రిలా, పేదల పాలిట అన్నయ్య,  ఏ వరాలు అడిగినా కాదనకుండా ఇచ్చే గొప్ప హృదయమున్న  నేతగా  కేసీఆర్‌గారు ప్రజలకు మంచి చేస్తున్నారు.  ‘మనంసైతం’ ద్వారా మేము చేస్తున్న ప్రతి మంచి పనిలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌  వెన్నంటి నిలుస్తున్నారు. ప్రతి ఏడాది ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు కేటీఆర్‌గారు సహాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న సామాన్యులకు న్యాయం చేయడానికి ఎంపీ సంతోష్‌కుమార్‌ నిరంతరం శ్రమిస్తున్నారు. సాయం కావాల్సిన ప్రతిసారి వారి వద్దకు వెళుతున్నాం. ఇప్పుడు వారికి సేవ చేసే సమయం వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ను గెలిపించండి. కేసీఆర్‌ అధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదవాళ్ల మీద చూపిస్తున్న ప్రేమ, వారి ఆదుకుంటున్న తీరును చూసే ఈ మాట చెబుతున్నా.   ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. సినీ పరిశ్రమలోని నలభై వేల మంది కార్మికులను  ఆదుకుంటామని చెప్పడం ఆనందంగా  ఉంది. ఇండస్ట్రీకి పదిహేను వందల ఏకరాలు కేటాయిస్తామని చెప్పడం గొప్ప విషయం. ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ తండ్రిలా మన వెన్నంటి నిలిచే కేసీఆర్‌గారిని, ప్రజలకష్టాల్ని తీర్చుతున్న కేటీఆర్‌గారికి మద్దతునివ్వాలని ఓటర్లను కోరుతున్నాను’ అని తెలిపారు.