సోమవారం 01 జూన్ 2020
Cinema - May 11, 2020 , 09:20:01

నిబంధ‌న‌లు ఉల్లంఘించిన పూన‌మ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

నిబంధ‌న‌లు ఉల్లంఘించిన పూన‌మ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

సంచ‌ల‌న కామెంట్స్‌తోనో లేదంటే హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో త‌ర‌చు వార్త‌ల‌లో నిలుస్తుంది పూన‌మ్ పాండే. తాజాగా ఈ అమ్మ‌డు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి పోలీసుల‌కి చిక్కింది. ఆదివారం రాత్రి పూన‌మ్ పాండే త‌న  బిఎమ్‌డబ్ల్యూ కారులో చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్‌ బాంబేతో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టింది. వారిని గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు,

లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి పూన‌మ్ అత‌డి స్నేహితుడు రోడ్డుపై తిరుగుతున్న క్ర‌మంలో వారిని అరెస్ట్ చేసిన‌ట్టు  జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ ధ్రువీకరించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో వీద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు కొద్ది సేప‌టి త‌ర్వాత వీరిని విడిచిపెట్టిన‌ట్టు తెలుస్తుంది


logo