సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉంటుంది పూజాహెగ్డే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ లేడీగా మారిపోయింది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను పూజాహెగ్డే పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. 6 సినిమాలు చేస్తోన్నపూజాహెగ్డే డే అండ్ నైట్ షిఫ్టుల వారిగా బిజీగా షెడ్యూల్ తో డేట్స్ సర్దుబాటు చేస్తోందట.
ఒక సినిమా వల్ల మరో సినిమాకు ఇబ్బంది రాకుండా షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంది. తాను ఒకే చేస్తున్న సినిమాల రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం పూజాహెగ్డే ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. దీంతో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ నటిగా నిలిచిందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. పూజాహెగ్డే కమిట్మెంట్, డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు ఆమె ఫాలోవర్లు.
ఇవి కూడా చదవండి..
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్