అద్భుతమైన రోజును ఆస్వాదించడం కంటే దాని గురించి నిరీక్షించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంటుందని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. అక్టోబర్‌లో ఈ భామ జన్మదినం జరుపుకోనుంది. ఇందుకోసం మూడు వారాల ముందుగానే సన్నాహాలు చేసుకుంటున్నానని చెప్పింది. అంత ముందస్తు ప్రణాళికలు ఎందుకని అడగ్గా తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘అక్టోబర్ 13న నా పుట్టినరోజు. చిన్నప్పటి నుంచి బర్త్‌డేను ఓ వేడుకలా జరుపుకోవడం అలవాటైంది. అలాగే సాధారణ పుట్టినరోజులా కాకుండా నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో థీమ్ బర్త్‌డే పార్టీ చేసుకోవడం చాలా ఇష్టం. దానికోసం నెలరోజుల ముందే ప్లాన్ చేసుకుంటా. అలా ఒక్కరోజు పండగ కోసం నెల రోజులు వేచిచూస్తుండటం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. పుట్టినరోజు నా వరకు జాతీయ సెలవు దినమనే భావనలో ఉంటా. నా స్నేహితులందరిని ఆహ్వానించి రోజంతా పార్టీని ఆస్వాదిస్తా’ అని చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నది. హిందీలో సల్మాన్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్‌లతో సినిమాలు చేస్తున్నది.