గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 02, 2020 , 23:20:13

ఎనిమిదేళ్ల తర్వాత

ఎనిమిదేళ్ల తర్వాత

తమిళ చిత్రం ‘ముగమూడి’తో 2012లో కథానాయికగా అరంగేట్రం చేసింది పూజా హెగ్డే. మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం పాలవ్వడంతో కోలీవుడ్‌లో మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది ఈ కన్నడ సోయగం. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత పూజాహెగ్డే తమిళంలో పునరాగమనం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ అగ్రకథానాయకుడు విజయ్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా పూజాహెగ్డేను కథానాయికగా తీసుకునే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే దర్శకనిర్మాతలు పూజాహెగ్డేను సంప్రదించినట్లు సమాచారం.  కథ నచ్చడంతో ఆమె ఈసినిమా చేయడానికి సుముఖతను వ్యక్తంచేసిందని చెబుతున్నారు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కెరీర్‌లోఅతిపెద్ద విజయాన్ని అందుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌ సినిమాతో పాటు అఖిల్‌ సరసన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'లో నటిస్తున్నది. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమా చేయబోతున్నది.logo