ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 17:53:47

పూజాహెగ్డే ఫ్యామిలీ త్రోబ్యాక్ స్టిల్స్

పూజాహెగ్డే ఫ్యామిలీ త్రోబ్యాక్ స్టిల్స్

హైదరాబాద్ : ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది అందాల భామ పూజా హెగ్డే. తెలుగు, హిందీ సినిమాలతో నిత్యం బిజీబిజీగా కనిపించే ఈ సుందరికి లాక్ డౌన్ తో తీరిక సమయం దొరికింది. క్వారంటైన్ టైంలో పూజా హెగ్డే తన ఫ్యామిలీతో సరదాగా కాలక్షేపం చేస్తోంది. 

పూజా హెగ్డే ఫ్యామిలీతో కలిసి దిగిన త్రోబ్యాక్ ఫొటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ ఈవెంట్ లో తల్లి లతా హెగ్డే, తండ్రి మంజునాథ్ హెగ్డే, సోదరుడు రిషబ్ హెగ్డేతో కలిసి దిగిన అరుదైన ఫొటోతోపాటు  పూజా చిన్ననాటి స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూజా ప్రస్తుతం ప్రభాస్-20వ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo