ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 10:38:33

ఆచార్య‌లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ బ్యూటీని ఫైన‌ల్ చేశారా..!

ఆచార్య‌లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ బ్యూటీని ఫైన‌ల్ చేశారా..!

ఇటీవ‌ల క‌రోనా నుండి కోలుకున్న‌రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయ‌న చేతిలో ఆర్ఆర్ఆర్ అనే మూవీతో పాటు ఆచార్య చిత్రాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు ప్రాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్ న‌టిస్తుంది. ఇక చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఇందులో  మెగాప‌వ‌ర్ స్టార్  స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఓ సాంగ్ కూడా ఉందని ప్ర‌చారం న‌డుస్తుంది. సిద్ధ అనే పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా, ఇటీవ‌ల ఆయ‌న పాత్ర‌కు సంబంధించి ప్రీ లుక్ విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది 

VIDEOS

logo