మంగళవారం 07 జూలై 2020
Cinema - Jun 05, 2020 , 09:20:06

పూజా హెగ్డే ఫేవ‌రేట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

పూజా హెగ్డే ఫేవ‌రేట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

వ‌రుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళుతున్న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు తాజాగా నెటిజ‌న్స్‌తో కొద్ది సేపు ముచ్చ‌టించింది. ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్ మీ అభిమాన క్రికెట‌ర్ ఎవ‌ర‌ని అడిగాడు. ఇందుకు పూజా.. . ఇంకెవరు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అని వెంటనే రియాక్ట్ అయింది. అంతేకాదు క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులో రాహుల్ ద్రవిడ్ ఆట తీరంటే ఇంకా ఇష్టమని తెలిపింది.

రాహుల్ ద్ర‌విడ్‌కి వీరాభిమానిని అని చెప్పిన పూజా.. ఈ త‌రం ఆట‌గాళ్ళ‌ల్లో ధోని, కేఎల్ రాహుల్ ఇష్ట‌ప‌డ‌తాన‌ని అంది. రాహుల్ ద్ర‌విడ్ చాలా క్లాసిక‌ల్ ఆట‌గాడు. అత‌నికి ఎవ‌రు సాటిరారంటూ పూజా .. రాహుల్ ద్ర‌విడ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. తాను షూటింగ్ స‌మ‌యాల‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, క‌నీసం క్రికెట‌ర్ స్కోరు తెలుసుకునే ప్ర‌య‌త్నం అయిన చేస్తానంటుంది. పూజా మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే ఆమెకి క్రికెట్‌పై మ‌క్కువ ఎక్కువ‌ని అర్ధ‌మ‌వుతుంది.  


logo