గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 21, 2020 , 23:38:42

పవన్‌కు జోడీగా..

పవన్‌కు జోడీగా..

‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కెరీర్‌లో తొలి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నది పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ విజయానందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నది  ఈ సొగసరి. తాజా సమాచారం ప్రకారం తెలుగులో పూజాహెగ్డే మరో అద్భుతావకాశాన్ని సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో  పీరియాడిక్‌ డ్రామా ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్‌ నిర్మాత ఏ.ఎమ్‌.రత్నం ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన పూజాహెగ్డే నటించబోతున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే దర్శకుడు క్రిష్‌ ఆమెను కలిసి కథను వినిపించినట్లు సమాచారం. తన పాత్రచిత్రణ నచ్చడంతో పూజాహెగ్డే ఈ సినిమా చేయడానికి సంసిద్ధతను వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానున్నట్లు  సమాచారం. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో  కథాగమనం సాగనున్నట్లు  తెలిసింది. 


logo